15 April, 2026 | 1:46 PM

Breaking News

కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి టీడీపీ మద్దతు

06-12-2025 12:00 AM

బూర్గంపాడు,డిసెంబర్ 5,(విజయక్రాంతి):బూర్గంపాడు మండలంలోని సార పాక మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ బలపరిచిన కిషోర్ శివ రాం నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. వీరికి టీడీపీ, ఐటీసీ టీఎన్టీయూసీ మిత్రపక్షా ల యూనియన్ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు టిఎన్టియుసి రాష్ట్ర నాయకులు పోటు రంగారావు, టిడిపి మండల అధ్యక్షుడు జగదీశ్వర్ రావు తెలిపారు. సారపాక అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కూటమి అభ్యర్థిని గెలిపించాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమం లో ఐటిసి టిఎన్టియుసి అధ్యక్షులు కనకమెడల హరిప్రసాద్, గల్లా భూషయ్య, యూని యన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.