25-05-2025 10:17:59 PM
పట్టణ అధ్యక్షునిగా బొల్లేపల్లి నియామకం..
వైరా (విజయక్రాంతి): వైరా తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party) కార్యాలయంలో వైరా పట్టణ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. పార్టీ వైరా నియోజకవర్గ పరిశీలకులు వాసిరెడ్డి రామనాథం ఈ సమావేశానికి హాజరై ఆయన సమక్షంలో పట్టణ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైరా పట్టణ అధ్యక్షుడిగా బొల్లెపల్లి శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులుగా పని అర్జున్ రావు, ప్రధాన కార్యదర్శిగా గుడ్ల నాగేశ్వరరావు, కార్యనిర్వాహక కార్యదర్శి చావా రవి, తూనాటి సత్యం, గుడ్డ శేషు, కందిమల్ల శ్రీనివాసరావు, హరి రమేష్, దావులూరు దినేష్, పాసంగులపాటి, శ్యాంసుందర్ లు ఎన్నికయ్యారు. ఈ సమావేశంలో వైరా నియోజకవర్గం మాజీ ఇంచార్జ్ చెరుకూరి చలపతిరావు, మోతుకూరి వెంకటేశ్వరరావు మందు డబ్బు మధుసూదన్ రావు అమరనేని వేణు సూర్యదేవర వెంకటకృష్ణ మద్దినేని రామారావు చావా కాంతారావు చావా రవి కొమిరిశెట్టి శ్రీధర్ నారాయణ కోట దాసు వడ్డెబోయిన అయ్యప్ప నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.