25-05-2025 10:14:34 PM
టేకులపల్లి (విజయక్రాంతి): కొత్తగూడెం-ఇల్లందు ప్రధాన రహదారిలోని సీతారాంపురం-లాలు తండా మధ్యలో ఆదివారం భారీ వృక్షం రోడ్డుపై పడడంతో రెండు గంటల పాటు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆదివారం ఆ ప్రాంతంలో గాలి దుమారం రావడంతో పెద్ద చెట్టు రోడ్డుకు అడ్డంగా పడి పోయింది. విషయం తెలిసిన టేకులపల్లి పోలీసులు అక్కడికి చేరుకొని జెసిబిని తెప్పించి రెండు గంటలపాటు శ్రమించి అడ్డంగా పడిపోయిన చెట్టును తొలగించడంతో రాకపోకలు కొనసాగాయి. ఆ సమయంలో అక్కడ ఎలాంటి వాహనాలు కానీ, వ్యక్తులు కానీ లేకపోవడంతో ఎలాంటి ప్రమాదం, ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.