calender_icon.png 26 May, 2025 | 2:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొడ్రాయి, బోనాల వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

25-05-2025 10:20:40 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఆదివారం నిర్వహించిన బొడ్రాయి, బోనాల వేడుకల్లో తొర్రూరు ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy), కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఝాన్సీ రెడ్డి(Congress Party Constituency Incharge Jhansi Reddy) బోనాలు సమర్పించి బొడ్రాయి వద్ద నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. గ్రామస్తులంతా సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆకాంక్షించారు. అనంతరం గ్రామస్తులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. బొడ్రాయి, బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో సందడిగా మారింది.