తెలంగాణలోనూ టీడీపీ సత్తా చాటుతాం
17-06-2024 12:25 AM
సీబీఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత
మణికొండ, జూన్16 : రాబోయే రోజుల్లో తెలంగాణలోనూ టీడీపీ సత్తా చాటుతుందని సీబీఎన్ ఫోరం అధ్యక్షురాలు సుమిత ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆదివారం మణికొండ పంచవటి కాలనీలో సీబీఎన్ ఫోరం అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్, మణికొండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసిస్తున్న చంద్ర బాబు అభిమానులు, సీబీఎన్ ఫోరం సభ్యులు వందలాది సంఖ్యలో తరలివచ్చారు.






