25 May, 2026 | 4:24 AM

స్వరాష్ట్ర వైతాళికుడు ప్రొఫెసర్ జాదవ్

17-06-2024 12:25 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 16 (విజయక్రాంతి): ప్రజా ఉద్యమాలకు ఆద్యుడు, ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో కీలక భూమిక పోషించిన స్వరాష్ట్ర సంగ్రామ వైతాళికుడు ప్రొఫెసర్ కేశరరావు జాదవ్ అని తెలంగాణ అమరవీరుల ఆశయ సాధన సమితి ప్రతినిధులు అన్నారు. జాదవ్ 6వ వర్ధంతి సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని సోమాజీ గూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. తొలు త ప్రొఫెసర్ జాదవ్ చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆయన పోరాడారని కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు కోసం నిబద్ధతతో పని చేసిన జాదవ్ వంటి ఉద్యమకారుల జయం తి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో ప్రెస్ అకాడమి చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, చంద్రకుమార్ పాల్గొన్నారు.