15-11-2025 12:35:57 AM
- మధ్యాహ్నం సంతకం ఉదయాన్నే చేస్తున్న ఉపాధ్యాయుడు
- నిబంధనలకు విరుద్ధంగా సంతకాలు ఎలా చేస్తారని ప్రశ్నించిన ఎంఈఓ
- ప్రశ్నించిన ఎంఈఓపై ఉపాధ్యాయుడు శంకర్ కర్రతో దాడి
- ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు
ఇల్లెందు, (విజయక్రాంతి): ఇల్లెందు మండల విద్యాశాఖ అధికారి, సుభాష్ నగర్ హై స్కూల్ హెచ్ఎం ఉమాశంకర్ పై ఉపాధ్యాయుడు ఈ శంకర్ దాడి చేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఎంఈఓ ఉమాశంకర్ ఉపాధ్యాయుడు శంకర్ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్టర్లో మధ్యాహ్నం సంతకం ఉదయాన్నే చేయడంతో గమనించిన ఎంఈఓ ఉపాధ్యాయుడిని ప్రశ్నించాడు. ఇలా ఇష్టానుసారంగా సంతకాలు చేయడం సరికాదని ఎంఈఓ పేర్కొన్నాడు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయుడు బూతులు తిట్టుకుంటూ ఎంఈఓపై దాడికి దిగాడు. కర్రతో ఎంఈఓ పై దాడి చేయడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి.
దీంతో కింద పడిపోయిన ఎంఈఓపై మరల దాడికి యత్నించాడు. దీంతో ఒక్కసారిగా ఉపాధ్యాయులంతా వచ్చి దాడిని నిలుపుదల చేశారు. వెంటనే ఎంఈఓను ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స చేయించారు. దాడికి సంబంధించి ఎంఈఓ ఉమాశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఎంఈఓ ఉమా శంకర్ జిల్లా డిఇఓకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ దాడిని పలు ఉపాధ్యాయ సంఘాలు ఖండించాయి.