15-11-2025 12:36:33 AM
నేరేడుచర్ల నవంబర్ 14: మండలంలోని దిర్శించర్ల రైస్ మిల్లులో తడిసిన ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతులు శుక్రవారం నిరసనకు దిగారు. గత రెండు రోజుల క్రితం కూడా రైతులు యాజమాన్యంతో మాట్లాడి తడిసిన ధాన్యాన్ని రూ.20 రూపాయలు తక్కువ చొప్పున కొనుగోలు చేయాలని అభ్యర్థించారు.
అయితే శుక్రవారం ఉదయం వచ్చిన ట్రాక్టర్ దాన్యమును వద్దు అనడంతోనే రైతు రైస్ మిల్లు ముందే ధాన్యం రాశిగా పోసి నిరసన వ్యక్తం చేశారు. మిర్యాలగూడ లో క్వింటాకి రూ.2500 చొప్పున కొనుగోలు చేస్తే ఈ రైస్ మిల్లులో 2300, 2400 చొప్పున మాత్రమే కొనుగోలు చేస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఇటువంటి మిల్లు యాజమాన్యం పై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరారు.