15-11-2025 12:34:48 AM
వలిగొండ, నవంబర్ 14 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో వలిగొండ మండల కాంగ్రెస్ శ్రేణులు వర్షం వ్యక్తం చేస్తూ బాణాసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. మాట్లాడుతూ ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీదే గెలుపని అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్‌ఎస్ పార్టీ కాంగ్రెస్ సునామీలో కొట్టుకపోయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో బత్తిని సహదేవ్, చెరుకు శివయ్య, కొండూరు భాస్కర్, కాసుల వెంకటేశం, కొండూరు సాయి తదితరులు పాల్గొన్నారు
చిట్యాల..
చిట్యాల, నవంబర్ 14(విజయ క్రాంతి): జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు గాను చిట్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలను జరుపుకున్నారు.
ఈ నెల11న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు శుక్రవారం వారం వెలువడగా భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చిట్యాల పట్టణంలోని శ్రీ కనకదుర్గ గుడి కేంద్రం వద్ద బాణాసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కాటo వెంకటేశం, కోనేటి కృష్ణ, బెల్లి సత్తయ్య, ఇబ్రహీం, చిరబోయిన యాదయ్య, బట్టు ఐలేష్, పోషబోయిన నరసింహ, రెమిడాల మధు, కోనేటి ఎల్లయ్య, ఆవుల సుందర్, సాగర్ నాగరాజు, జిట్టా శ్రీకాంత్, రెబడాల నరసింహ, చిట్టా స్వామి, సాగర్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
నూతనకల్..
నూతనకల్, నవంబర్ 14:జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వల్లల నవీన్ యాదవ్ భారీ విజయాన్ని సాధించడంతో శుక్రవారం నూతనకల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు.నవీన్ యాదవ్ 24658 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించిన వార్త తెలియగానే, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నూతనకల్ ప్రధాన కూడలి వద్దకు చేరుకున్నారు.
వారు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు.కాంగ్రెస్ పార్టీ జెండాలను చేతబూనిన కార్యకర్తలు,యువకులు డ్యాన్స్లు చేస్తూ, ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ విజయం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని అభివర్ణించారు.నవీన్ యాదవ్ గెలుపు నూతనకల్లోని కాంగ్రెస్ కార్యకర్తలలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని స్థానిక నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు నాగం సుధాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు దరిపెల్లి వీరన్న,పాల్వాయి నాగరాజు,మండల నాయకులు గుణగంటి వెంకన్న, అనంతుల శ్రీనివాస్,వేల్పుల వెంకటమల్లు, కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.