14 July, 2026 | 3:49 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

నవ్విండన్న సాకుతో విద్యార్థిని చితకబాదిన టీచర్..!

01-10-2024 01:30 PM

ప్రైవేటు పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): తరగతి గదిలో పాఠం చెప్తుండగా నవ్విండన్న సాకుతో పదో తరగతి విద్యార్థిపై తరగతి ఉపాధ్యాయుడు పైశాచికంగా దాడికి తెగబద్దాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రిజం ప్రైవేటు పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి చెందిన తౌఖిర్ నల్లవెల్లి రోడ్డు లోని ది ప్రిజం ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. సోమవారం తరగతి గదిలో పవన్ అనే ఉపాధ్యాయుడు పాఠం బోధిస్తుండగా సదరు విద్యార్థి నవ్విండని తన చేతిలో ఉన్న కర్రతో విచక్షణ రహితంగా కర్ర విరిగేదాకా దాడి చేశాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మంగళవారం పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు.