05-08-2025 08:27:26 PM
నిర్మల్,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఉపాధ్యాయుల బదిలీలు వెంటనే చేపట్టాలని పాఠశాలను బలోపేతం చేయాలని విద్యాశాఖ ఖాళీలను భర్తీ చేయాలని మధ్యాహ్న భోజన కార్మికులు సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో ప్రభాకర్ కు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు విజయకుమార్ శంకర్ అశోక్ రాజేష్ నాయక్ వెంకట్రావు నాయక్ గజేందర్ బలరాం లింగన్న సాజిత్ షబ్బీర్ అలీ తదితరులు ఉన్నారు