అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంల పంపిణీ
21-07-2026 12:00 AM
మల్దకల్, జూలై 20: మల్దకల్ మండలంలోని ఎల్కూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన ఉచిత యూనిఫాంలను సోమవారం గ్రామ సర్పంచ్ పి. వినోద్ కుమార్ చిన్నారులకు పంపిణీ చేశారు. అంగన్వాడీ టీచర్ షామీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పరిశుభ్రత, క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుభావతి, ఆశా కార్యకర్తలు, గంగన్న, పెద్ద మునెన్న, తల్లిదండ్రులు పాల్గొన్నారు.






