11-07-2025 12:00:00 AM
ఖమ్మం, జూలై 10 ( విజయ క్రాంతి ):గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ఖమ్మం బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు అధ్యక్షత వహించారు.వేదికపై ప్రముఖ గురువులు, ఉపాధ్యాయులు, వేద పండితులు, సాంప్రదాయ కళల మాస్టర్లకు ఘన సన్మానం నిర్వహించారు.
ముఖ్యంగా తేజశ్రీ, కొదండ రామాచార్యులు, తాండ్ర రాంప్రసాద్ గురుస్వామి, ఆరుట్ల శ్రీనివాసాచార్యులు, గుజ్జుల శ్రీనివాస్ రెడ్డి లను ప్రత్యేకంగా గౌరవించారు. వారందరికీ శాలువాలు కప్పి, మొమెంటోలు అందించి సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా నెల్లూరి కోటేశ్వరరావు మాట్లాడుతూ గురువు తత్వం మన సంస్కృతిలో పునితమైనది. గురువు బోధనలే విద్యార్థుల భవితకు బలం.
గురువును ’పరబ్రహ్మ’గా భావించే దేశం మనది. ప్రతి విద్యార్థి తమ గురువును గౌరవిస్తూ, వారి ఆశయాన్ని నమ్మి ఎదగాలి. ప్రభుత్వాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు గురువులకు కనీస గౌరవాన్ని కల్పిస్తూ, వేతనాలు సమయానికి చెల్లించాలి,‘ అని పిలుపునిచ్చారు.
ఈ వేడుకల్లో ఖమ్మం జిల్లా గురు పౌర్ణమి కన్వీనర్ మేకల నాగేందర్, గెంటేల విద్యాసాగర్ బీజేపీ ఖమ్మం అసెంబ్లీ కన్వీనర్ అల్లిక అంజయ్య, సుదర్శన్ మిశ్రా ,మందడపు సుబ్బారావు, తడుపునూరి రవీందర్ , మందా సరస్వతి, అత్తి విజయ రెడ్డి , నెల్లూరు బెనర్జీ, పొట్టి మూర్తి జనార్దన్, రజినీ రెడ్డి, శ్రీరామనేని మనీ, ఈశ్వరప్రగడ రాము, పాలెపు రాము తదితరులు పాల్గొన్నారు.