10-07-2025 11:21:57 PM
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి నియోజకవర్గం(Serilingampally Constituency) పరిధిలోని పలువురు వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకొనగా లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ సహాయనిధి ద్వారా మంజూరైన రూ. 6,00,000/- లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను గురువారం తన నివాసంలో బాధిత కుటుంబాలకు పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముఖ్యమంత్రి సహాయనిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేద, అభాగ్యులకు అండగా.. సీఎం సహాయనిధి ఆర్థిక భరోసా నిస్తుందని తెలియచేశారు. అనంతరం వైద్య చికిత్సకు సహకారం అందించిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, పురెందర్ రెడ్డి, నాని, సర్వర్ తదితరులు పాల్గొన్నారు.