మల్లన్నను దర్శించుకున్న టీచర్స్ ఎమ్మెల్సీ
23-12-2025 12:00 AM
కొమురవెల్లి, డిసెంబర్ 22: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారిని టీచర్లు ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చిన ఆయన గర్భాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనాలిచ్చారు. ఆలయ ఈవో వెంకటేష్ స్వామివారి చిత్రపటం తో పాటు ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య శాశ్వత అన్నదానానికి విరాళంగా రూ. లక్ష రూపాయలను చెక్కును ఈవో వెంకటేష్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్,ఆంజనేయులు ఆలయ పర్యవే క్షకులు నీల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.






