calender_icon.png 23 December, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ జనమంచి గౌరీ శంకర్(గౌరిజీ) యువ పురస్కారం-2026 కోసం దరఖాస్తుల ఆహ్వానం

22-12-2025 11:18:36 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): ఏబీవీపీ తెలంగాణ 44వ రాష్ట్ర మహాసభలు శంషాబాద్ లో జనవరి 3,4,5 తేదీలలో నిర్వహిస్తున్న సందర్భంగా ఏబీవీపీ కరీంనగర్ విభాగ్ కన్వీనర్ అజయ్ మాట్లాడుతూ ఏబీవీపీ ప్రతి సంవత్సరం రాష్ట్ర మహాసభలలో అనేక రకాల సమస్యల పైన చర్చించి తీర్మానాలు ప్రవేశపెట్టడం జరుగుతుందని, అలాగే సమాజంలో సేవ కార్యక్రమలు చేసే వారిని ప్రోత్సహిస్తూ ప్రతీ సంవత్సరం రాష్ట్ర మహాసభలలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో ఎబివిపి పని విస్తృతికి విశేష కృషి చేసి, సమాజ సేవకే తన జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన శ్రీ జనమంచి గౌరీశంకర్ (గౌరీజీ) గారి పేరు మీద ప్రతి సంవత్సరం రాష్ట్ర మహాసభలలో సమాజంలో సేవ కార్యక్రమంలు చేసే వారిని ప్రోత్సహిస్తూ అందజేసే "శ్రీ జనమంచి గౌరీ శంక యువపురస్కార్" పేరుతో సత్కరించడం జరుగుతుంది. కావున ఆసక్తి కలిగిన వారు దరఖాస్తులు కోరబడుతున్నాయి.

ఈ యొక్క దరఖాస్తు చేసుకోవాలిసిన వారు సమాజంపై సానుకూల ప్రభావం చూపే సేవా కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, ఇతర ప్రముఖ రంగాలలో విశేష కృషి కనబరుస్తూ, యువతీ యువకులకు స్ఫూర్తిగా నిలిచే జాతీయ భావాలు కలిగిన 40 సంవత్సరాల లోపు వయసు కలిగిన ఆదర్శ యువత్ యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ అవార్డు కింద 50,000/- (ఏభై వేల రూపాయల నగదు పురస్కారం, ప్రశంసా పత్ర అందజేయబడతాయి. దరఖాస్తుదారులు తమ పూర్తి బయోడేటా, చేస్తున్న కార్యక్రమాల వివరాలు పంపవలసి ఉంటుంది అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.దరఖాస్తు చేసుకునే వారు వివరాల కోసం వి. రామ కృష్ణ 9666149044 మరియు కె.అజయ్ 9959389483 కి సంప్రదించలని తెలిపారు.