టీచర్లకు టెట్ మినహాయింపు ఇవ్వాలి
తెలంగాణలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంవత్సరానికి రెండుసా ర్లు ప్రత్యేకంగా టెట్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చరిత్రాత్మక నిర్ణ యం. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం పట్ల రాష్ట్రంలోని అన్ని ఉపాధ్యాయ సంఘాలు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ ఉత్తీర్ణత సాధించాలని 2026 మే 29న సుప్రీంకోర్టు పేర్కొన్న విషయం విదితమే. గతంలో 2025 సెప్టెంబర్ 1న ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వగా, దేశంలోని 69 ఉపాధ్యాయ సంఘాలు, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. అయినా ఉపాధ్యాయులకు అనుకూలంగా తీర్పు రాలే దు.
అయితే, తాజా తీర్పుపై ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. జనగణన కోసం ఉపాధ్యాయు లందరూ మండుటెండల్లో విధులు నిర్వహిస్తున్నారు. జూన్ నెలలో ఉపాధ్యాయు లకు ‘సర్’ విధులను కేటాయించారు. ఈ క్రమంలో పని ఒత్తిడి వల్ల టెట్ పరీక్ష రాయడానికి సిద్ధం కాలేకపోతున్నామని చాలా మంది ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉపాధ్యా య శిక్షణ పూర్తిచేసుకున్న ఛాత్రోపాధ్యాయులకు, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు వేర్వేరుగా పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం ముదావహం.
సుప్రీంకోర్టు తీర్పులో ఏముంది?
గతంలో ఇచ్చిన తీర్పును యథావిధిగా అమలు చేయాలని సుప్రీంకోర్టు ఇటీవల పేర్కొన్నది. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించడానికి ఉన్న రెండు సంవత్సరాల గడువును పొడిగించి, మొత్తంగా మూడేళ్లలోపు టెట్ తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు చెప్పింది.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో టెట్ నిర్వహణ కోసం ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. అయితే, ఇన్ సర్వీస్ ఉపా ధ్యాయుల ప్రస్తావన ఈ నోటిఫికేషన్‌లో ఎక్కడా లేదు. అయితే, ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఇంకా ఎంత మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత కాలేదని కేంద్రం లెక్కలు కోరగా, తమకు అనుకూలంగా నిర్ణయం వెలువడవచ్చని ఉపాధ్యాయులు ఎంతో ఆశతో ఎదురుచూశారు. ఈ తరుణంలో టెట్ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు కోర్టు వెలువరించడంతో ఇన్ సర్వీస్ టీచర్లలో మళ్లీ టెన్షన్ మొదలైంది. చివరికి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా టెట్ నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెమో జారీచేయడంతో ఊరట లభించింది.
2009లో విద్యాకమిషన్ వచ్చిన తర్వా త 2010 నుంచి టెట్ అమలులోకి వచ్చిం ది. టెట్ అమలులోకి వచ్చిన తర్వాత 2012, 2017, 2024 మూడుసార్లు టీచర్ల రిక్రూట్‌మెంట్ జరిగింది. అంతకుముందు జరిగిన టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో టెట్ లేదు. అయితే, సుప్రీంకోర్ట్ తీర్పులో ఐదేళ్లలోపు పదవీ విరమణ ఉన్నవాళ్లకు మిన హాయింపు ఇచ్చింది. 1996 నుంచి టీచర్లుగా సేవలందిస్తున్న వారిలో 50 ఏళ్లు దాటిన వాళ్లు చాలామంది ఉన్నారు.
కంటిచూపు, మోకాళ్ల నొప్పులు, ఇతర అనారో గ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో 50 ఏళ్లు దాటినవారికి మినహాయింపు ఇవ్వడం కనీ స ధర్మం. ప్రధానోపాధ్యాయ పదోన్నతు ల్లో 50 ఏళ్లు దాటిన వారికి డిపార్ట్‌మెంట్ పరీక్ష నుంచి మినహాయింపు ఉంది. 2024లో ఎన్‌సీటీఈని ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం వివరణ కోరగా, 2010 కంటే ముందు టీచర్లకు టెట్ అవసరం లేదని చెప్పింది. అయితే, సుప్రీం కోర్ట్ తీర్పుతో 30 వేల మంది టీచర్లపై ప్రభావం పడుతుంది.
భాషోపాధ్యాయులు ఉర్దూ, కన్నడ, ఇతర దేశ భాషల్లో బోధించే ఉపాధ్యాయులకు ఏపీలో పేపర్ నిర్వహిస్తున్నారు. తెలంగాణలో మాత్రం భాషోపాధ్యాయులకు (తెలుగు, హిందీ, ఉర్దూ, కన్నడం, తమిళం ఇతర దేశీయ భాషలు), బయోలజి బోధించే ఉపాధ్యాయులకు వారికి సంబంధించిన సబ్జెక్టులో టెట్ పరీక్షను నిర్వహించకుండా, వారికి సంబంధం లేని ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, గణితం, భౌతిక శాస్త్రం, సైకాలజీలో పరీక్షలను నిర్వహించ డం శోచనీయం. తెలంగాణలో భాషోపాధ్యాయులకు సాంఘిక శాస్త్రం 60 మార్కు లకు కేటాయించడం వల్ల చాలామంది తెలుగులో ఉత్తీర్ణత సాధించడం లేదు.
బయాలజీ ఉపాధ్యాయులకు గణితం, భౌతిక శాస్త్రంలో పరీక్షలు నిర్వహించడం తో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో పేపర్ నిర్వహిం చి భాషోపాధ్యాయులకు న్యాయం చేయా లి. ఏ వృత్తిలో లేని అర్హత పరీక్ష ఉపాధ్యాయులకు మాత్రమే నిర్వహించడంలో ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. టెట్ ఉత్తీర్ణత సాధించకుంటే పదోన్నతి రాదనడం, ఉద్యోగం వదులుకోవలనడం న్యాయమా? విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధానాన్ని అమలు చేస్తుందో చూడాలి.
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 60 మార్కు లు, బీసీలకు 75 మార్కులు, జనరల్‌కు 90 మార్కులు రావాలనడం సమంజసం గా లేదు. ఏ పరీక్షలోనైనా 35 మార్కులకే ఉత్తీర్ణత ఉంటుంది. అలాంటిది టెట్‌లో 90 మార్కుల నియమం ఉపాధ్యాయుల ను ఆందోళనకు గురిచేస్తున్నది. కులాల ప్రాతిపదికన ఉత్తీర్ణత మార్కులు నిర్ణయించడం సరికాదు.
రెండు, మూడు దశాబ్దాలుగా వేల మంది పదవ తరగతి విద్యార్థులకు బోధిం చి, వారిని ఉత్తమ పౌరులుగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. కొంతమంది విద్యా ర్థులను ఉపాధ్యాయులను చేసిన ఘనత కూడా ఉన్నది. అలాంటి ఉపాధ్యాయులు నేడు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించనంత మాత్రాన ఉపాధ్యాయ వృత్తికి పనికిరారని చెప్పడం సబబు కాదు.
ఈ వ్యాస రచయిత డాక్టర్ ఎస్ విజయ భాస్కర్ 2024లో తెలంగాణ హైకోర్టులో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్ దాఖ లు చేశారు. సీనియర్ న్యాయవాది ఉమారాణి వాదనలు విన్న హైకోర్టు 2011 కంటే ముందు ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉత్తర్వులు జారీచేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నాను.
మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగ, ఉపాధ్యాయులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదురహిత హెల్త్‌కార్డులను డిజిటల్ రూపంలో జారీచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం శుభపరిణామం. హెల్త్‌కార్డుల కోసం ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారు. వీలైనంత త్వరలో ఉద్యోగ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు మంజూరు అవు తాయని ఉద్యోగ, ఉపాధ్యాయ నాయకు లు ఆశాభావంతో ఉన్నారు. అలాగే టెట్ మినహాయింపు విషయంలోనూ ప్రభు త్వం సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
పోరాటాలే శరణ్యం లేకుంటే, అరణ్యం అంటూ ఉద్యమాల ద్వారానే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఈ విషయంలో న్యాయం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు అంటున్నారు. సుప్రీంకోర్టులో ఉపసమనం లభిస్తుందని అనేక మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేయలేదు. సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్లను తోసిపుచ్చడం, పాత తీర్పును అమలు చేయాలని చెప్పడంతో ఇన్ సర్వీ స్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి తప్పించుకునే మార్గం లేకుండాపోయింది.
ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు త్వర గా నిర్ణయం తీసుకొని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ ఉత్తీర్ణత మార్కులను తగ్గించాలి. అంతేకాదు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ ఉపాధ్యాయులకు అర్హత మార్కు లు ఒకే విధంగా ఉండేటట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయాలని ఉపాధ్యాయు లు కోరుతున్నారు. అలాగే సర్వీస్ రూల్స్ సమస్యను పరిష్కరించి ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలి.
వ్యాసకర్త సెల్: 9290826988






