14 July, 2026 | 6:21 PM

Breaking News

చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •   వ్యవసాయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన   •   సదర్ మాట్ కాలువ కట్టపై పిచ్చి మొక్కల తొలగింపు   •   త్రాగునీటి శుద్ధి కేంద్రాలు ఆకస్మిక తనిఖీ   •   ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన చెక్కు పంపిణీ   •  

సీఎంతో టీచర్లు సమావేశానికి తరలిరావాలి

30-07-2024 01:31 AM

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): గత పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహిస్తున్నారని పీఆర్టీయూ టీఎస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందిన దాదాపు 30వేల మంది ఉపాధ్యాయులతో ఆగస్టు 2న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సమావేశం నిర్వహించనున్నారని తెలిపారు. ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో పదోన్నతులు పొందిన ఉపాధ్యాయులతో సీఎం నేరుగా మాట్లాడుతారన్నారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపేందుకు సమావేశానికి టీచర్లు పెద్దసంఖ్యలో హాజరు కావాలని వారు కోరారు.