14 July, 2026 | 6:53 PM

Breaking News

కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •  

గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ భేటీ

30-07-2024 01:34 AM

ఘనంగా వీడ్కోలు పలికిన రాజ్‌భవన్ సిబ్బంది

హైదరాబాద్, జూలై 29 (విజయక్రాంతి): గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. తాజాగా రాధాకృష్ణన్‌ను మహారాష్ట్ర గవర్నర్‌గా నియమి స్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. త్వరలో అక్కడ బాధ్యతలు స్వీకరించనున్నా రు. ఈ నేపథ్యంలో గవర్నర్‌కు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. రాజ్‌భవన్‌లో నిర్వహిం చిన వీడ్కోలు సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ జితేందర్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారి వెంకటేశం పాల్గొన్నారు.