12 May, 2026 | 2:26 AM

టీజీ20 లీగ్‌ను తక్షణమే ఆపాలి

12-05-2026 12:54 AM
  1. జస్టిస్ నవీన్‌రావుకు టీసీఏ విజ్ఞప్తి
  2. బీసీసీఐకి సైతం రిప్రజెంటేషన్

హైదరాబాద్, మే 11 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తోన్న టీజీ20 లీగ్ ను తక్షణమే ఆపాలని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) మరోసారి డి మాండ్ చేసింది. ఈ మేరకు హెచ్‌సీఏ వ్యవహారాల ను పర్యవేక్షిస్తు న్న ఏకసభ్య కమిటీ జస్టిస్ పి.నవీన్‌రావుకు, బీసీసీఐకి అత్యవసర రిప్రజెంటేషన్ సమర్పించింది. గత రెండు దశాబ్దాలుగా ఆర్థిక అక్రమా లు, క్రిమినల్ కేసులను ఎదుర్కొంటున్న హెచ్‌సీఏ ఇప్పుడు ఎ టువుంటి ముందస్తు అనుమతులు లేకుం డా ఫ్రాంచైజీ ఆధారిత లీగ్‌ను నిర్వహించడానికి ప్రయత్నిస్తోందని టీసీఏ పే ర్కొంది.  హెచ్‌సీఏ జనరల్ బాడీ ఆమోదం లేకుండా, బీసీసీఐ నుండి ఎటువంటి రాతపూర్వక అనుమతి లేకుండా నిబంధనలు ఉల్లంఘి స్తూ టీజీ20 గవర్నింగ్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారని తెలిపింది.

హైదరాబాద్ వెలుపల ఉన్న తెలంగాణ జిల్లా ల్లో హె చ్‌సీఏకు ఎటువంటి అధికార పరి ధి లేదని, అక్కడ క్రికెట్ అభివృద్ధిని టీసీఏ పర్యవేక్షిస్తోందని పేర్కొంది. జిల్లాల పేర్లతో కార్పొరేట్ సంస్థలకు లీగ్ హ క్కులను విక్రయించడం లేదా కేటాయించడం చట్టవిరుద్ధమని టీ సీఏ స్పష్టం చేసింది. ఈ అక్ర మలీగ్ వల్ల ఆటగాళ్లు, స్పాన్స ర్లు, ఇతర స్టాక్‌హోల్డర్లు తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని, భవిష్యత్తులో చట్టపరమైన ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఒకవేళ టీజీ20 లీగ్ నిర్వహణ విషయంలో హెచ్‌సీఏ వెనక్కి తగ్గకుంటే సివిల్,క్రిమనల్ చర్యల కోసం కోర్టును, బీసీసీఐని ఆశ్రయిస్తామని టీసీఏ ప్రధాన కార్యదర్శి ధరం గు రువారెడ్డి హెచ్చరించారు.