17 May, 2026 | 11:04 PM

నెక్లెస్‌రోడ్‌ను కూల్చి వేస్తారా?

26-08-2024 05:53 AM
  1. హైడ్రాకు చట్టబద్ధత ఉందా 
  2. ప్రభుత్వ కార్యాలయాలను కూలుస్తారా.. 
  3. సీఎంను ప్రశ్నించిన ఎంపీ ఒవైసీ 
  4. మక్కా మసీద్‌కు డీడ్ ఎక్కడ నుంచి తేవాలె

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (విజయక్రాంతి):  హుస్సేన్ సాగర్ ఎఫ్‌టీఎ ల్ పరిధిలో ఉన్న  నెక్లెస్‌రోడ్‌ను కూలుస్తారా అని సీఎం రేవంత్ రెడ్డిని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. అసలు హైడ్రాకు చట్టబ ద్ధత ఉందా అని ఆయన నిలదీశారు. హైద రాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో అక్ర మ నిర్మాణాలంటూ హైడ్రా కూల్చివేతలపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందిం చారు.  హుస్సేన్‌సాగర్ వద్ద నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను సైతం కూల్చి వేస్తారా అని ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్ పరిధి లో నిర్మించిన నిర్మించిన ప్రభుత్వ కార్యాల యాలను హైడ్రా అధికారులు కూలుస్తారా అంటూ నిలదీశారు.

నెక్లెస్‌రోడ్ సైతం ఎఫ్ టీఎల్ పరిధిలోనే ఉందని, జీహెచ్‌ఎంసీ సైతం నీటికుంటలో నిర్మించిందేనని వాటిని కూడా కూల్చివేస్తారా అన్ని తీవ్రంగా ధ్వజ మెత్తారు.  కేంద్ర ప్రభుత్వానికి సంబం ధించిన సీసీఎంబీఆఫీస్ హిమాయత్‌సాగర్ వద్దనే ఉందని, నగర పరిధిలోని పలు ప్రభు త్వ కార్యాలయాలు సైతం చాలా వరకు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయన్నారు. గోల్కొండలో ఉన్న చెరువులో గోల్ఫ్ కోర్టు ఉందని, అక్కడ  ఐఏఎస్, ఐపీఎస్‌లు సైతం గోల్ఫ్ ఆడుకుంటారని, అవసరమైతే అక్కడి కి వెళ్లి చూడాలని, లేకపోతే ఫోటోలు కావా లంటే తానే ఇస్తానన్నారు. ఎఫ్‌టీఎల్ సమ స్యపై నగర మేయర్‌ను కలిశామని, ప్రభు త్వం ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తానన్నారు. 

వక్ఫ్‌బోర్డుకు వ్యతిరేకంగా బిల్లు.. 

వక్ఫ్‌బోర్డుకు వ్యతిరేకంగా బీజీపీ ప్రభు త్వం బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబో తుందని అసదుద్దీన్ తెలిపారు. ముస్లింలను లేకుండా చేయాలని మోదీ ప్రభుత్వం చూస్తోందంటూ మండిపడ్డారు. మజీద్‌లు, దర్గాల లాగా వక్ఫ్ బోర్డు ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు కావన్నారు. ఎప్పటి నుంచో ఉన్న వక్ఫ్ ఆస్తులకు డీడ్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. మక్కా మసీద్‌కు డీడ్ కావాలంటే ఎక్కడ నుంచి తేవాలంటూ కేంద్రాన్ని ఆయన నిలదీశారు.