6 July, 2026 | 9:07 PM

Breaking News

రోడ్ల నిధులను హై లెవెల్ వంతెనల పేరుతో ప్రచారం చేస్తున్నారు: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య   •   డబల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై సమగ్ర విచారణ జరిపించాలని వినతి   •   సమస్యల నిలయంగా బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రి   •   పర్యావరణ సేవలకు ప్రకృతి ప్రకాష్‌కు రాష్ట్రస్థాయి 'స్తంభాద్రి స్ఫూర్తి పురస్కారం'   •   ముఖర్జీ ఆశయాలు కొనసాగిద్దాం   •   సీఈఓగా నరేష్ వద్దంటూ ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వైస్ చైర్మన్   •   ఆర్&బి రోడ్డు భవనాల పనులు వేగంవంతం చేయాలని సమీక్ష   •   రేబిస్ వ్యాధి నివారణకు చేయి చేయి కలుపుదాం   •   అనాధ శవానికి అంత్యక్రియలు చేసిన గౌతమ బుద్ధ స్వచ్ఛంద సేవా సంస్థ   •   జర్నలిస్టుల స్థలం కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి   •  

సాంకేతికమే సమస్య!

26-06-2025 12:08 AM
  1. భూభారతిలోనూ కొనసాగుతున్న ఇక్కట్లు 
  2. సాదాబైనామా తదితర అంశాలపై రాని స్పష్టత 
  3. పరిష్కారం కోసం ఎదురుచూపులు

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ధరణి ఏర్పాటుకు ముందు అనేక భూసమస్యలతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్రంగా ఇబ్బందులు పడింది. ధరణి ఏర్పాటుతో చాలావరకు సమస్యలు పరిష్కారం అయినప్పటికీ అనంతరం మార్పులు, తప్పులను సరిదిద్దే బాధ్యత సీసీఎల్‌ఏ, కలెక్టర్లకు మాత్రమే అందుబాటులో ఉండటంతో లక్షల దర ఖాస్తులు పెండింగ్‌లో పడిపోయాయి.

చివరకు ఏదైనా కారణాలతో రిజిస్ట్రేషన్ రద్దు చేసుకున్నా దరఖాస్తుదారు చెల్లించిన రుసుం వాపస్ రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా కోట్లాది రూపాయల ప్రజల సొమ్ము రెవెన్యూశాఖ వద్దే ఉండిపోయింది. దీనిపై గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ధరణిలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపిస్తామని కాంగ్రెస్ సర్కారు ‘భూభారతి’ తీసుకొచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 14న సీఎం రేవంత్‌రెడ్డి ఈ చట్టాన్ని ప్రారంభించారు.

3 విడతల్లో 10,725 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి 8.58 లక్షల దరఖాస్తులు స్వీకరించారు. ప్రస్తుతం వాటిని కంప్యూటరైజేషన్ చేసే కార్యక్రమం నడుస్తోందని అధికారులు చెబుతున్నారు. అయితే భూ భారతిలో సాఫ్ట్‌వేర్ సమస్యలు వస్తున్నాయని.. ఫలి తంగా కంప్యూటరీకరణ ఆలస్యమవుతోందని రెవెన్యూ అధికారులు తెలిపారు. కాగా, సాదాబైనామాకు సంబంధించి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలుస్తోంది. 

కొనసాగుతున్న టెక్నికల్ సమస్యలు..

ధరణి పోయి భూభారతి వచ్చినా సాఫ్ట్‌వేర్ సమస్యలు అలాగే కొనసాగుతున్నాయని రెవె న్యూ అధికారులు అంటున్నారు. సాదాబైనామాలకు ఆన్‌లైన్‌లో ఇంకా ఆప్షన్ రాలేదంటున్నారు. దీనికి ఆప్షన్ ఆర్డీవోకు ఉందో అడిషనల్ కలెక్టర్ కు ఉందో ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ భూ ములు కొన్నవారు దరఖాస్తు పెట్టుకున్నా ఇంకా వాటికి పరిష్కారం ఏంటో అప్డేట్ రాలేదని తెలుస్తోంది.

ప్రొహిబిటెడ్ సర్వే నెంబర్‌లో భూములు ఉన్న వ్యక్తి చనిపోతే వారి కుటుంబీకుల పేరిట మార్చేందుకు ఇంకా ఆప్షన్ రాలేదు. కొం దరి పొ లాలు ఎండోమెంట్, వక్ఫ్, అసైన్డ్ పేరిట చూపించారు. వాటిపై చేసుకున్న దరఖాస్తులకు కూడా స్పందన లేదు. ధరణి ఉన్నప్పుడు ఎప్పటి నుంచో కలెక్టర్ స్థాయిలో, సీసీఎల్‌ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు నేటికీ అలాగే ఉన్నాయి.

భూమి స్వభావం మార్పుల కోసం సీసీఎల్‌ఏలో ఉన్న దరఖాస్తులన్నీ పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో సమస్యల పరిష్కారం కోసం రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. త్వరలో స్థానిక  సందడి మొ దలుకానుండటంతో భూభారతికి వచ్చిన సమస్య ల పరిష్కారానికి కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు అంటున్నాయి. 

ఆరుకు తగ్గిన మాడ్యుళ్ల సంఖ్య.. 

ధరణిలో తప్పుల సవరణకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు, ఫిర్యాదులుంటే మ్యుటేషన్ నిలిపివేతకు, రిజిస్ట్రేషన్ నిలిపివేతకు అవకాశం లేకుం టే భూభారతిలో అవకాశం కల్పించారు. ధరణిలో భూసమస్యలకు సంబంధించి దరఖాస్తుకు 33 మాడ్యూళ్లు ఉండేవి. ఒక్కో సమస్యకు ఒక్కో మాడ్యూల్ ఏర్పాటు చేశారు.

అవగాహన లేమితో చాలా మంది రైతులు ఒకదానికి బదులుగా మరో మాడ్యూల్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే అది తిరస్కారానికి గురయ్యేది. ప్రతీసారి రూ.1,200 వెచ్చించి దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మాడ్యూళ్ల సంఖ్యను 6కు తగ్గించారు. వివిధ రకా ల భూములు ఉండటంతో ఈ 6 మాడ్యుళ్లు ఎం తవరకు సరిపోతాయనే సందేహాలు ఉన్నాయి.

రెవెన్యూ సదస్సుల్లో గుర్తించిన సమస్యలు..

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో ఎక్కువగా సాదాబైనామాలు, విస్తీర్ణం నమోదులో హెచ్చుతగ్గులు (ఆర్‌ఎస్‌ఆర్), అసైన్డ్ భూముల అంశాలు, రికార్డు ల్లో అచ్చుతప్పులు, ప్రొహిబిటెట్ ల్యాండ్‌లో విరాసత్, రిజిస్ట్రేషన్ పెండింగ్ తదితర సమస్యలు రైతులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తంగా మూడు విడతల్లో భాగంగా ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకున్నారు.

వీటిని కంప్యూటరీకరణ చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి సమస్యలన్నీ పరిష్కరిస్తామని ప్రభుత్వం చెప్తోంది. భూవివాదాల పరి ష్కారం, భూయాజమాన్య హక్కుల్లో స్పష్టత వస్తుందని అంటోంది. రాష్ట్రవ్యాప్తంగా నక్షా లు లేని 413 గ్రామాలకు నక్షాను రూపొందించేందుకు ప్రభుత్వ కార్యాచరణ కొనసాగుతోంది.