26-06-2025 12:08:12 AM
అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
గద్వాల, జూన్ 25 ( విజయక్రాంతి ) : రబీ సీజన్ నాటికి లింకు కెనాల్ ద్వారా చిన్నోనిపల్లి రిజర్వాయర్ ను పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని అలంపూర్ ఎమ్మెల్యే విజేయుడు కోరారు. బుధవారం హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని అలంపూర్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే వినతి పత్రాన్ని అందచేశారు.
ఈ సందర్బంగా అలంపూర్ మండలంలోని బుక్కాపురం లిఫ్ట్ ఇరిగేషన్ కు కొత్త మోటర్లు,పంపుసెట్లు మరియు ఊట్కూరు- 1,క్యాతూరు, గుందిమల్ల,అలంపూర్ లలోని లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లను మెయింటెనెన్స్ చేయాలని వచ్చే రబి సీజన్ నాటికి మోటార్లను రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.