calender_icon.png 18 January, 2026 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు

18-01-2026 12:04:29 AM

టీఆర్పీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ శ్రేణులు

హైదరాబాద్/జనగామ, జనవరి 17(విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఘనంగా జరిగాయి.శనివారం హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లన్న జన్మదినం సందర్బంగా  పండుగ వాతావరణం నెలకొంది.ఈ వేడుకల్లో పార్టీ నాయ కులు, కార్యకర్తలు, మల్లన్న అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని తమ ప్రియతమ నేతకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాల యంలో భారీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో అభిమానులు స్వచ్ఛదంగా రక్తదానం చేశారు.

అభిమానుల సమక్షంలో మల్లన్న  కేక్ కట్ చేశారు. పూలమాలలు, శాలువాలతో నాయకులు ఆయ న్ని  ఘనంగా సత్కరించారు.కేవలం హైదరాబాద్‌లోనే కాకుండా, తెలంగాణ వ్యాప్తంగా టీఆర్పీ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేశారు. పలుచోట్ల పేదలకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనాథా శ్రమాల్లో దుస్తుల పంపిణీ, మొక్కలు నాటడం వంటి కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. తమ నేత తీన్మార్ మల్లన్న నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండి, ప్రజల పక్షాన పోరాడాలని ఆయన అభిమానులు ఆకాంక్షించారు. 

ప్రజల కోసం అహర్నిశలు శ్రమించే నేత

తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన సందర్భంగా శనివారం జనగామ జిల్లా కార్యాలయంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జిట్టబోయిన నరేష్ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌చార్జి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి, నిరంతరం ప్రజా సేవలో తరిస్తున్న మా ప్రియతమ జననేతకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతు న్నామన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం, ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమించే మా నాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నా మన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఉదరి సతీష్ ముదిరాజ్, జనగామ పట్టణ అధ్యక్షుడు గడ్డం కృష్ణ, జిల్లా యూత్ అధ్యక్షుడు మంద దిలీప్, జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సంతోష్, యూత్ నియోజకవర్గ అధ్యక్షులు, జఫర్గడ్డ మండల అధ్యక్షులు కలకోట బాబు, యూత్ మండల అధ్యక్షుడు ముక్క విష్ణు వర్ధన్, పట్ట ణ కార్యదర్శి వల్లాల భానుచందర్, ఉమేష్, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.