calender_icon.png 18 January, 2026 | 7:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిరసన తెలిపే హక్కులేదా?

18-01-2026 12:02:31 AM

సికింద్రాబాద్ అస్తిత్వం కోసమే ర్యాలీ

ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాన్ని ఆపలేరు

తలసాని సాయికిరణ్ యాదవ్

పలువుల బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల అరెస్టు

సికింద్రాబాద్/సనత్‌నగర్/ముషీరాబాద్, జనవరి 17 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ అస్థిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాం గ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు బీఆర్‌ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో సికింద్రాబాద్ బచావో పేరుతో ర్యాలీకి బీఆర్‌ఎస్ పిలుపు మేరకు సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాలో పలువురు బిఆర్‌ఎస్ పార్టీనాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో హాజరై సికింద్రాబాద్ బచావో నినాదాలతో నల్ల జెండాలు, కండువాలు ధరించి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు సాగుతున్న ర్యాలీని అడ్డుకొని పలువుల నాయకులను అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అదేవిధంగాఅనుమతి లేదంటూ తెలంగాణ భవన్ వద్ద బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు.. ర్యాలీ నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్న జాయింట్ సీపీ హెచ్చరిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ర్యాలీ చేస్తామని ఐదు రోజుల కింద మేము అనుమతి కోరితే, రాత్రి పోలీసులు రిజెక్ట్ చేశారని మాజీమంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాద వ్ అన్నారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో తలసాని సాయి కిరణ్ యాదవ్, మాజీ బేవరేషన్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ జక్కుల మహేశ్వర్ రెడ్డి, పాండు యాదవ్, లోకనాధం, బిఆర్‌ఎస్ అధ్యక్షుడు ఆకుల హరికృష్ణ, నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, శ్రీహరి, నాగులు, కె.కిషోర్ కుమార్, యాదవ్, సత్యనారాయణ, బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

శాంతియుత ర్యాలీని అడ్డుకొని అరెస్టు చేయడం అప్రజాస్వామికం

ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్

సికింద్రాబాద్ సాంస్కృతిక అస్తిత్వాన్ని  కాపాడటం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో శాంతియూత ర్యాలీ నిర్వహిస్తుంటే అడ్డుకొని బిఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. సికింద్రాబాద్ బచావో పేరిట శాంతియుత నిర్వహించిన ర్యాలీకి బయలుదేరిన బీఆర్‌ఎస్ యువ నాయకుడు జయసింహతో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలను అరెస్టు చేశారు.

అనంతరం వారిని అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ, డివిజన్ ప్రెసిడెంట్లు ఎం. రాకేష్ కుమార్, వై. శ్రీనివాస్, శంకర ముదిరాజ్, వల్లాల శ్యామ్ యాదవ్, బల్ల శ్రీనివాస్ రెడ్డి, కొండ శ్రీధర్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ ముచ్చకుర్తి ప్రభాకర్, దిన దయాల్ రెడ్డి, కార్యదర్శులు, సాయి కృష్ణ, దామోదర్ రెడ్డి, పోతుల శ్రీకాంత్ , అరుణ్ కుమార్, శివ ముదిరాజ్, సుధాకర్ గుప్తా, వాల్లాల శ్రీనివాస్ యాదవ్, కేశవ పురం అరుణ్, ముదిగొండ మురళి, ఇంద్రసేనా రెడ్డి, వల్లాల  రవి యాదవ్, బిక్షపతి, బొట్టు శీను, తదితరులు పాల్గొన్నారు.