15-11-2025 01:42:10 AM
మహువాలో సోదరుడు ప్రతాప్ ఓటమిబీహార్‌లోని రాఘోపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆర్జీడీ నేత, మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్ గెలిచారు. సాయంత్రం జరిగిన ఓట్ల లెక్కింపులో తీవ్రమైన ఉత్కంఠ మధ్య తేజస్వీ గెలుపొందారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి సతీశ్‌కుమార్‌పై 14,532 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తేజస్వీ మొత్తం 1,18,597 ఓట్లు దక్కించుకున్నారు. ఈ గెలుపుతో రాఘోపూర్‌లో తేజస్వీ మూడోసారి గెలిచినట్లయింది.