calender_icon.png 15 November, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్ గాంధీ ఎక్కడ ?

15-11-2025 01:43:48 AM

  1. బీహార్ ఎన్నికల ఫలితాల వేళ సోషల్ మీడియాలో మీమ్స్

ఓట్ చోరీ అంటూ హడావిడి చేసి ఎక్కడికి వెళ్లారంటూ ప్రశ్నలు

రాహుల్ నేతృత్వం వహించిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిందని ట్వీట్లు

న్యూఢిల్లీ, నవంబర్ 14: ‘బీహార్‌లో ఎన్నికల కౌంటింగ్ జరుగుతున్న వేళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఎక్కడ?’ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ‘ఓట్ చోరీ అంటూ పోరాటం చేసిన రాహుల్ గారూ.. మీ మహాఘట్బబంధన్ ఓడిపోయేలా ఉంది’ అని ఓ నెటిజన్ పోస్టు చేశారు. మరొకరు.. ‘రాహుల్‌జీ ఎక్కడికి వెళ్లారు.. ఆర్జేడీ తేజస్వీ యాదవ్‌ను పూర్తిగా ముంచేసి విడిదికి ఎక్కడికి వెళ్లారు’ అని రాసుకొచ్చారు.

బీహార్‌లో సీఎం నీతీశ్‌కుమార్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమంటూ, రాహుల్‌ను విమర్శిస్తూ వేలాది మంది పోస్టులు పెడుతున్నారు. మహాఘట్బంధన్ ఘోర ఓటమి చవిచూస్తున్న వేళ రాహుల్ విదేశాల్లో విడిది చేస్తున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఎద్దేవా చేశారు. రాహుల్ విదేశంలో సూర్యోదయం చూసేలోపు, బీహార్‌లో మహాఘట్బంధన్ అస్తమిస్తుందని పేర్కొన్నారు.

‘జెన్ జెడ్’ యువత అంతా ఎన్డీయే కూటమికే మద్దతు పలికారని పేర్కొన్నారు.  రాహుల్ గాంధీ నిరంతర ఎన్నికల పరాజయాలకు చిహ్నంగా మారారని మరికొందరు బీజేపీ నేతలు ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు రాహుల్‌గాంధీ బీహార్‌లో 23 జిల్లాలను కవర్ చేస్తూ 16 రోజుల పాటు ఓటరు అధికార్ యాత్ర ను చేపట్టారని, అయినా.. పైసా ప్రయోజనం లేకపోయిందని తేలిపోయిందన్నారు.

20 ఏళ్లు.. 95 ఓటములు

గడిచిన రెండు దశాబ్దాల్లో దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఏఐసీ రాహుల్ గాంధీ 95సార్లు ఓడిపోయారని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎద్దేవా చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాఘట్బంధన్ ఓటమిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. రాహుల్ 2004  25 మధ్య రాహుల్ నేతృత్వం లో జరిగిన అన్ని ఎన్నికల్లో నూ కాంగ్రెస్ ఓటమి చవిచూసిందని పేర్కొన్నారు.

తా జాగా బీహార్‌లో ఎదురైన పరాభవంతో రాహుల్ ఓటముల్లోనే రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఓటముల్లో స్థిరత్వానికి అవార్డులు ఉంటే, అవన్నీ ఆయనకే దక్కేవన్నారు. రా హుల్ పరాజయాలను చూసి ఓ టమి కూడా ఆశ్చర్యపోకత ప్పదని ఎద్దేవా చేశారు.