1 August, 2026 | 5:52 PM

Breaking News

వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •   ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దాం   •   ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు మరింత మెరుగుపర్చాలి   •   రిఫీలింగ్ సెంటర్లపై దాడి.. 16 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం   •   అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేయాలి   •   విద్యార్థులకు అండగా నిలబడడమే 'యూత్ ఫర్ సేవ' లక్ష్యం   •   కోనరావుపేట మండలంలో ఎమ్మార్పీఎస్ నూతన కమిటీల ఏర్పాటు   •  

తెలంగాణ ఉద్యమకారుడు హనుమంతు మృతి

14-07-2025 05:30 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తొలి, మలి దశ ఉద్యమించిన మహబూబాబాద్ కు చెందిన గుంజే హనుమంతు(85) అనారోగ్యంతో మరణించారు. హనుమంతు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 లో చేపట్టిన ఉద్యమంతో పాటు 2001 నుండి చేపట్టిన మలిదశ ఉద్యమంలో మహబూబాబాద్ ప్రాంతంలో కీలక పాత్ర వహించారు. హనుమంతు మరణం పట్ల మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) సంతాపం తెలిపారు. హనుమంతు ఎన్నో ఒడిదులుకులు ఎదుర్కొన్న తెలంగాణ సాధన కోసం అహర్నిశలు కష్టపడ్డాడని గుర్తు చేశారు. వివిధ పార్టీల నేతలు, పలు సంఘాల బాధ్యులు, హనుమంతు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.