calender_icon.png 8 November, 2024 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రపంచస్థాయి సాంకేతిక గమ్యంగా తెలంగాణ

13-09-2024 12:00:00 AM

మాది ఇండస్ట్రీ, ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీ ప్రభుత్వం

ఇన్నోవేషన్‌లో ఉద్యోగాల కల్పనకు కృషి

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 

జీఎఫ్ లైఫ్ టెక్ కంపెనీ ప్రారంభోత్సవం 

వచ్చే మూడేళ్లలో 500 మందికి ఉద్యోగాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): జీఎఫ్ లైఫ్ టెక్ గ్లోబల్ సామర్థ్య కేంద్రం ప్రారంభంతో తెలంగాణ ప్రపంచస్థాయి సాంకేతిక, నూతన పరిశోధనల గమ్యస్థానంగా మారిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద 30 వేల చ.అడుగుల భవనంలో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ఈ సామర్థ్యం కేంద్రం వల్ల ప్రస్తుతం 200 మందికి ఉద్యోగాలు లభించాయని తెలిపారు.

వచ్చే మూడేళ్లలో ఈ సంఖ్య 500 దాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నోవేషన్‌లో తెలంగాణ ను అగ్రగామిగా నిలిపి పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనకు రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కేంద్రం నుంచి జీఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు ఉత్తమ సేవలను అందించగలుగు తుందని ఆకాంక్షించారు. సమృద్ధిగా ఉన్న మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ అంతరాయాలు లేని ప్రయాణాలు పరిశ్రమలకు అనువైన వాతావరణాన్ని సృష్టించాయని వెల్లడించారు.

తెలంగాణలో తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వచ్చే కంపె నీలన్నింటికీ నైపుణ్యమున్న మానవ వనరులను అందిస్తామని చెప్పారు. టెక్నాలజీతోనే నాణ్యమై న జీవన విధానం లభిస్తుందని తెలిపారు. ఎయిర్ బ్యాగ్స్, సీట్ బెల్టులు, స్టీరింగ్ వీల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి ఆధునిక సురక్షిత ఉత్పత్తుల ఇంజినీరింగ్‌లో జీఎఫ్ లైఫ్ టెక్ సంస్థకు అపారమైన అను భవం ఉందని మంత్రి శ్రీధర్‌బాబు ప్రశంసించా రు. కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రుడాల్ఫ్ స్టార్క్, ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రవికుమార్ పాల్గొన్నారు.