calender_icon.png 16 October, 2024 | 12:33 AM

ఇరాన్‌తో హైదరాబాద్‌ది బలమైన బంధం

13-09-2024 12:00:00 AM

  1. కుతుబ్‌షాహీ వారసత్వాన్ని పరిరక్షిస్తాం
  2. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): హైదరాబాద్  ఇరాన్ మధ్య బలమైన సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. కుతుబ్ షాహీ రాజవంశ వారసత్వాన్ని పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని, హైదరాబాద్‌లోని కుతుబ్ షాహీ సమాధులను పునరు ద్ధరించడం తమ నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఇరాన్  -భారతదేశంతో పాటు తెలంగాణ మధ్య సాంస్కృతిక, పర్యాటక రంగాల్లో పరస్పరం సహకరమే లక్ష్యంగా హైదరాబాద్‌లో గురువారం ఇరా న్ పర్యాటక రోడ్ షో ఈవెంట్ నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రెండు ప్రాంతాల మధ్య పర్యాటక సం బంధాలను బలోపేతం చేయడానికి ఇదో గొప్ప వేదిక అన్నారు. పర్యాటకులకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పించేందుకు, వారసత్వ పరిరక్షణ, స్థానిక కళలు, హస్తకళలను ప్రోత్సహిం చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

సంబంధాలు బలోపేతం : షల్బాఫియాన్  

శతాబ్దాలుగా భారతదేశానికి ఇరాన్‌తో చారిత్రక, సాంస్కృతిక అనుబంధం ఉందని ఆ దేశ పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ శాఖ డిప్యూటీ మంత్రి షల్బాఫియాన్ పేర్కొన్నారు. భారత్‌తో సంబంధాల బలోపేతానికి నూతన పర్యాటక విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగరంతో ఇరాన్‌కు ప్రత్యేకమైన అనుబం ధం ఉందన్నారు. హైదరాబాద్ రెండు దేశాలను కలిపే వారధిగా నిలుస్తుందని అభివర్ణించారు. భారత్ పర్యాటకులు రెండు దేశాల్లో పర్యటించడం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు బలపడతాయని, సాంస్కృతిక మార్పిడి జరుగుతుందని హైదరాబాద్‌లో ఇరాన్ కాన్సుల్ జనర ల్ మైదీ షహారొఖీ తెలిపారు. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, ఇరాన్ కాన్సులేట్ సెకండ్ కన్సుల్ మోహసిన్ మొగద్దమీ, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ టూరిజం డైరెక్టర్ జనరల్ షోజేహి, రీజినల్  పాస్‌పోర్ట్ అధికారి స్నేహజ, తెలంగాణ పర్యాటక శాఖ డైరెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొన్నారు.