22 July, 2026 | 2:43 PM

అమరవీరుల త్యాగ ఫలమే ప్రత్యేక తెలంగాణ

01-06-2024 03:13 AM

ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, మే 31 : ఉద్యమంలో ప్రాణాలు ఆర్పించిన అమరవీరుల త్యాగ ఫలమే తెలంగాణ రాష్ట్ర సాధనకు పునాది అని మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మీర్‌పేట్ క్యాంపు కార్యాలయంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జూన్ 1వ తేదీన అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ నియోజకవర్గం పరిధిలో సాయంత్రం భారీ ప్రజానీకంతో క్రొవ్వొత్తుల ర్యాలీ ఉంటుందన్నారు.

2వ తేదీన జిలెల్లగూడ చందన చెరువు అమరవీరుల స్థూపం వద్ద అమర వీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సన్మాన కార్యక్రమం ఉంటుం దన్నారు. 3వ తేదీన మండలాలు, మున్సిపల్, కార్పొరేషన్, డివిజన్లలో ఎక్కడి వారు అక్కడ జాతీయ జెండాల ప్రదర్శన నిర్వహిస్తారని పేర్కొన్నారు. మూడు రోజులు పలు సేవ కార్యక్రమాలు ఉంటాయని స్పష్టం చేశారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు అర్కల కామేష్‌రెడ్డి, బడం గ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి పాల్గొన్నారు.