calender_icon.png 3 December, 2025 | 1:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాహుల్, ప్రియాంక గాంధీని కలిసిన తెలంగాణ కాంగ్రెస్ బృందం

03-12-2025 01:23:54 PM

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కూడిన ప్రతినిధి బృందం పార్లమెంట్ హౌస్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ ప్రియాంక గాంధీని మర్యాదపూర్వకంగా కలిశారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లో జరుగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌(Telangana Rising Global Summit)కు ఆహ్వానం అందించారు.

ఈ పర్యటనలో భాగంగా తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2025కు రావాల్సిందిగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని కలిసి ఆహ్వానించారు.  అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమై తెలంగాణ రైజింగ్ సదస్సుకు ఆహ్వానించారు. ప్రధానితో పాటు కేంద్ర ఐటీ, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను, కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను కలిసి  గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని కోరారు.