9 May, 2026 | 10:45 AM

Breaking News

కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •  

బెహరాన్‌లో 9 మంది తెలంగాణ డ్రైవర్ల అరెస్టు

18-06-2025 12:00 AM

ప్రవాసీ ప్రజావాణిని ఆశ్రయించిన బాధితుడి కుమారుడు 

జగిత్యాల, జూన్ 17 (విజయక్రాంతి): ఉపాధి వేటలో గల్ఫ్ బాట పట్టి, అక్కడ డ్రైవర్లుగా పనిచేస్తున్న 9 మంది తెలంగాణ వాసులు ఓ కేసులో ఇరుక్కున్న విషయం వెలుగు చూసింది. బెహరాన్ దేశంలోని ఆల్ మోహయ్యద్ కంపెనీలో డ్రైవర్లుగా పని చేస్తున్న 9 మంది తెలంగాణవాసులను ఇంధన దుర్వినియోగం కేసులో ఇటీవల అక్కడి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలిసింది.

వీరిలో జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లకు చెందిన బొమ్మిడి సుదర్శన్ అనే ప్రవాస భారతీయుడు కూడా ఉన్నాడు. ఆయనతో పాటూ మరో 8 మంది ఈ నెల 4న అరెస్ట్ అయ్యారని సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన వారికి న్యాయ సహాయం అందించాలని కోరుతూ బొమ్మిడి సుదర్శన్ కుమారుడు నితిన్ హైదరాబాద్ ప్రజాభవన్‌లోని ప్రవాసీ ప్రజావాణిలో ముఖ్యమంత్రి పేరిట మంగళవారం వినతి పత్రం సమర్పించారు.

ఈ మేరకు ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి, మెంబర్లు సింగిరెడ్డి నరేశ్‌రెడ్డి, గుగ్గిల్ల రవిగౌడ్, నంగి దేవేందర్‌రెడ్డి, బొజ్జ అమరేందర్‌రెడ్డిలను కలిసిన నితిన్ తన తండ్రితో పాటూ మిగతా 8 మందిని బెహరాన్ జైలు నుంచి విడిపించాలని కోరారు. కాగా ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు చేపట్టేలా చూస్తామని వారు భరోసా ఇచ్చారు.