17 April, 2026 | 11:02 AM

పారమితలో వేడుకలు

02-06-2025 03:25 PM

కరీంనగర్,(విజయక్రాంతి): పౌరమిత విద్యాసంస్థలలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక నగరంలోని పారమిత విద్యాసంస్థలలో  ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా అన్ని పారమిత పాఠశాలలో పతాక ఆవిష్కరణ చేసారు. ఉపాధ్యాయులు తెలంగాణ గొప్పతనాన్ని చాటే పాటలను పాడి తెలంగాణ చరిత్ర మరియు గొప్పతనాన్ని తెలియజేసే సందేశాలను ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్‌ డా. ఇ.ప్రసాదరావు తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్‌ ప్రసూన, అనుకర్‌ రావు, వినోద్‌ రావు, రాకేష్, రశ్మిత, ప్రాచి, వియు.యం, ప్రసాద్‌, టి.యస్.వి. రమణ, హన్మంత రావు, ప్రధానోపాధ్యాయులు గోపిక్రిష్ణ, బాలాజి, ప్రశాంత్, శ్రీకర్,శర్మిష్ఠ, కవిత ప్రసాద్, సమన్వయకర్తలు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.