calender_icon.png 15 September, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ప్రైవేట్ విద్యాసంస్థల బంద్‌.. ప్రభుత్వం కీలక చర్చలు

15-09-2025 10:13:17 AM

ప్రైవేట్ కళాశాలల.. యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు

సమ్మె విరమణకు సానుకూల స్పందన

హైదరాబాద్: ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై(Fee reimbursement dues) ఇవాళ ప్రకటన చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) పేర్కొన్నారు. అర్ధరాత్రి 12.30 వరకు భట్టి విక్రమార్క ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో( private college owners) సుమారు నాలుగు గంటలపాటు చర్చలు నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి చైర్మన్, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తెలంగాణలో సోమవారం నుంచి ప్రైవేట్ కాలేజీలు బంద్ కు ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య పిలుపునిచ్చింది.

4 ఏళ్లుగా ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవడాన్ని నిరసిస్తూ బంద్ కు పిలుపునిచ్చాయి. ప్రైవేటు కళాశాలల సమస్యలు అర్థం చేసుకున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు. నేడు ప్రభుత్వపరంగా ఒక నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో తెలంగాణ ప్రభుత్వం(Telangana Government) చర్చలు కొనసాగిస్తుంది. ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వం మరోసారి చర్చించనుంది. చర్చలు సానుకూలంగా కొనసాగాయని భట్టి విక్రమార్కపేర్కొన్నారు. ప్రైవేట్ కళాశాలలు సమ్మె విరమణకు యాజమాన్యాల నుంచి సానుకూల స్పందన లభించినట్టు వెల్లడించారు. ప్రజాపాలనలో ప్రతి విద్యార్థి భవిష్యత్తు ప్రభుత్వ భాద్యతగా భావిస్తున్నామని  భట్టి విక్రమార్క వెల్లడించారు.