24 July, 2026 | 9:32 AM

చంద్రబాబును కలిసిన తెలంగాణ గవర్నర్

28-06-2024 01:29 PM

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడ్ ను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ కలిశారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో శుక్రవారం ఉదయం మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలు, పెండింగ్ అంశాలపై చర్చించినట్లు సమాచారం.

అంతకు ముందు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న తెలంగాణ గవర్నర్ కు పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఉండవల్లిలోని సీఎం నివాసానికి చేరుకున్న ఆయనకు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ స్వాగతం పిలికి, శాలువాతో సత్కరించారు.