calender_icon.png 11 May, 2025 | 8:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం నజరానా

09-07-2024 04:37:54 PM

హైదరాబాద్ : టీం ఇండియా క్రికెటర్ మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నజరానాను ప్రకటించింది. క్రికెటర్ సిరాజ్ కు ఇంటి స్థలం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ పరిసరాల్లో స్థలం గుర్తించాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీ20 ప్రపంచకప్ విజేత జట్టులోని సిరాజ్ ను ముఖ్యమంత్రి అభినందించారు.