13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

దానం నాగేందర్‌కు షాక్ — పార్టీ ఫిరాయింపుపై హైకోర్టు నోటీసులు!

23-03-2026 01:41 PM

హైదరాబాద్: అసెంబ్లీ కార్యదర్శికి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు(MLA Danam Nagender) తెలంగాణ హైకోర్టు నోటీసులిచ్చింది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి(Alleti Maheshwar Reddy) హైకోర్టులో విచారణ జరిగింది. దానం నాగేందర్ పార్టీ మారిన వ్యవహారంపై తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పును కొట్టేయాలని ఏలేటి పిటిషన్ వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్ నుంచి లోక్ సభకు పోటీ చేశారని తెలిపారు.

ఇతర పార్టీ నుంచి నామినేషన్ వేసిన రోజు నుంచే అనర్హుడిగా ప్రకటించాలని ఏటేటి కోర్టును కోరారు. కర్నాటక, బీహార్ లో ఇలాంటి పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పులను ఏలేటీ తన పిటిషన్ లో ప్రస్తావించారు. అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి(Advocate General Sudarshan Reddy) స్పీకర్ తరఫున వాదించేందుకు హాజరయ్యారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డిపై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు(Telangana High Court) తెలిపింది. నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని దానం నాగేందర్‌కు తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ హైకోర్టు వచ్చే నెల 16కి వాయిదా వేసింది.