13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. త్వరలో డీఏ బకాయిలు

23-03-2026 02:05 PM

ప్రతి సమస్యనూ మానవీయ కోణంలో చూస్తాం. 

ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తాం. 

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ చేతల్లో మానవీయ కోణం కనిపించడం లేదని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) ఆరోపించారు. పీఆర్ సీ, డీఏల బకాయిల గురించి స్పష్టం చెప్పాలని కోరారు. విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని డిమాండ్  చేశారు. ప్రభుత్వ వివరణ పట్ల నిరసన తెలుపుతూ సభ నుంచి వాకౌట్ చేస్తున్నామని హరీశ్ రావు పేర్కొన్నారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) సమాధానం చెప్పారు.

ప్రతి సమస్యనూ తాము మానవీయ కోణంలోనే చూస్తామని తెలిపారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన మూడు డీఏ బకాయిలు(DA Arrears) గత బీఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ పెట్టిందని, మిగతా డీఏ బకాయిలు కూడా త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. పదవీ విరమణ ప్రయోజనాలు గత ప్రభుత్వం చెల్లించలేదని భట్టి ఆరోపించారు. రిటైర్ మెంట్ ప్రయోజనాలు చెల్లించలేకే పదవీ విరమణ వయసు పెంచారని తెలిపారు. దానివల్ల తమ ప్రభుత్వంపై అదనపు భారం పడిందని వివరించారు.

గత ప్రభుత్వం రూ. 40,154 కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని లెక్కచెప్పారు.  ఉద్యోగులకు కూడా రూ. 4,571 కోట్ల బకాయిలు పెట్టారని, సాధ్యమైనంత త్వరగా ఉద్యోగుల బకాయిలు చెల్లిస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఒకటో తేదీనే జీతాలు చెల్లిస్తున్నామని వెల్లడించారు. పెండింగ్ బకాయిల కింద ప్రతి నెల రూ. 700 కోట్లు ఇస్తున్నామని చెప్పారు. మానవీయ కోణం ఉంది కనుకే ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డు ఇస్తున్నామని పేర్కొన్నారు.