2 March, 2026 | 5:19 AM

గ్రామీణ ఏఐలో తెలంగాణ విజేత

02-03-2026 01:40 AM
  1. టీ టెక్నాలజీ సభ ఏఐ కేటగిరీ అవార్డు
  2. అవార్డు అందుకున్న టీ ఎండీ వేణుప్రసాద్

హైదరాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో కృత్రిమ మేధస్సు(ఏఐ) విస్తరణకు చేసిన వినూత్న కృషికి గుర్తింపుగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్(టీ ప్రతిష్టాత్మక అవార్డును సొంతం చేసుకుంది. టెక్నాలజీ సభ నిర్వహించిన కార్యక్రమంలో ఏఐ కేటగిరీలో టీ-ఫైబర్‌ను విజేతగా ప్రకటించింది. హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానం చేశారు.

తెలంగాణలో తొలి గ్రామీ ణ ఏఐ ల్యాబ్‌ను స్థాపించి, గ్రామీణ యువతకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అం దుబాటులోకి తీసుకువచ్చినందుకు టీ ఈ గౌరవం లభించింది. ఈ ల్యాబ్ ద్వారా గ్రామీణ విద్యార్థులు, స్టార్టప్‌లు, యువ ఇంజినీర్లు ఏఐ ఆధారిత పరిష్కారాలను అభివృద్ధి చేసుకునే అవకాశాలు పొం దుతున్నారు. టీ మేనేజింగ్ డైరెక్టర్ పీ వేణుప్రసాద్ ఈ అవార్డును సంస్థ తరఫున స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గ్రామీణెేపట్టణ డిజిటల్ అంతరాన్ని తగ్గించడం, ప్రతి గ్రామానికి హైస్పీడ్ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అందించడం టీ ప్రధాన లక్ష్యమని తెలి పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏఐ వంటి ఆధునిక సాంకేతికతను విస్తరించడం ద్వారా యు వతకు కొత్త అవకాశాలు సృష్టించడమే తమ ధ్యేయమని చెప్పారు.

సీఎం, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు దూరదృష్టి నాయకత్వంలో టీ తెలంగాణలో డిజిటల్ మార్పుకు కీలక వేదికగా నిలుస్తోందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ మౌలిక వసతులను బలోపేతం చేయడంతో పాటు, ఆధునిక సాంకేతికతను ప్రజలకు చేరువ చేయడంలో టీ-ఫైబర్ ముఖ్యపాత్ర పోషిస్తోందని అన్నారు. ఈ అవార్డు ద్వారా తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక విప్లవానికి తీసుకున్న చర్యలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించినట్టయింది. భవిష్యత్‌లో కూడా గ్రామీణ డిజిట ల్ అభివృద్ధికి టీ మరిన్ని వినూత్న కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సంస్థ వర్గాలు వెల్లడించాయి.