15-11-2025 11:58:42 AM
మోసం చేయడం హరీశ్ రావు నైజం
హైదరాబాద్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kavitha ) కీలక వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ... హరీశ్ రావు అనుచరులు ఇప్పుడు కొత్త పాటు పాడుతున్నారు. హరీశ్ రావు ప్రచారం చేయకే జూబ్లీహిల్స్ లో ఓడిపోయామని అంటున్నారు.. మోసం చేయడం హరీశ్ రావు నైజం అన్నారు. మెదక్ లో ఉద్యోగాలకు డబ్బు తీసుకున్నారు. నేను బయటకు వచ్చి ప్రజా సమస్యలపై తిరుగుతున్నా.. కేటీఆర్ ఇప్పటికైనా సామాజిక మాధ్యమాలు బంద్ చేసి బయటకు రావాలని కవిత డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు బాణాలు వేసుకోవడమే సరిపోతుందన్నారు. కవిత చేపట్టిన 'జాగృతి జనం బాట' పాదయాత్ర మెదక్ జిల్లాకు చేరుకుంది. మెదక్, నాగ్సాన్ పల్లిలోని వడ్డెర కాలనీని సందర్శించిన కవిత కాలనీలోని 30 గుడిసెల్లో జీవించేందుకు అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. కాలనీ వాసులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మెదక్ శివారులోని పిల్లికొట్టాల డబుల్ బెడ్రూం కాలనీని సందర్శించి స్థానికుల ఇబ్బందులు తెలుసుకున్నారు.