calender_icon.png 15 November, 2025 | 2:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు ప్రమాదాల నివారణపై యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ర్యాలీ

15-11-2025 01:01:23 PM

జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అభినయ్ నాయుడు

వేగం వద్దు. ప్రాణం ముద్దు అంటున్న యువత ,ప్రజలు

తుంగతుర్తి, (విజయక్రాంతి): ప్రయాణాల సమయంలో రోడ్డు భద్రతపై వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు అభినయ్ అన్నారు. శనివారం మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరుకుప్పల నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడారు. హెల్మెట్‌ లేకుండా ప్రయాణించడం, డ్రైవింగ్‌ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం, మద్యం సేవించి వాహనం నడపడం, మొబైల్‌ ఫోన్ వినియోగిస్తూ డ్రైవింగ్‌ చేయడం వంటి చర్యలు ప్రమాదాలకు దారితీస్తాయన్నారు.

తల్లిదండ్రులు ఎట్టి పరిస్థితుల్లోను పిల్లలకు బైకులు ఇవ్వొద్దన్నారు. వేగం వద్దు... ప్రాణం ముద్దు అంటూ నినాదాలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రాజమోహన్, అధ్యాపకులు పుల్లయ్య, గణేష్, సంవిధాన్ మండల కోఆర్డినేటర్ మాచర్ల అనిల్ క్యాస్ట్రో, వివిధ మండలాల అధ్యక్షులు శిగ నసీర్ గౌడ్, పసుల అశోక్ యాదవ్, షేక్. వలీ, చింతకుంట్ల హరీష్, మరికంటి వెంకటేష్, బొంకూరి రంజిత్, లకావత్ ప్రకాష్, అక్బర్, పవన్, జటంగి మహేందర్, అబ్దుల్, శ్రీకాంత్, మహేష్, నరేష్, వరుణ్, రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.