15-11-2025 01:06:55 PM
హుస్నాబాద్,విజయక్రాంతి: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ఫిషరీస్ కార్పొరేషన్ మెట్టు సాయి కుమార్ లు శనివారం పర్యటించారు. హుస్నాబాద్ పట్టణంలో ఉన్న పశువైద్య శాల ను పరిశీలించిన మంత్రులు. హుస్నాబాద్ లో పశు సంపద ఎక్కువ ఉంటుందనీ, పశు వైద్యశాల ను ఆధునీకరించి అభివృద్ధి చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి నీ కోరిన మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ పశు వైద్యశాలను ఆధునీకరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి వాకిటి శ్రీహరి. అనంతరం హుస్నాబాద్ లోని ఎల్లమ్మ చెరువు వద్ద చేప పిల్లల పంపిణీ ప్రారంభించి అదే చెరువులో చేప పిల్లలను వదిలారు. పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు.