calender_icon.png 15 November, 2025 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 2 కిలో మీటర్లు ట్రాఫిక్ జామ్

15-11-2025 12:59:31 PM

చివ్వెంల,(విజయక్రాంతి): దూరజ్‌పల్లి సమీపంలో ఆర్టీసీ బస్సు, ముందుకు వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొన్న సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల సమాచారం మేరకు బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఘటనతో రహదారిపై దాదాపు 2 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వాహనాలను పక్కకు మార్చి ట్రాఫిక్‌ను సర్దుబాటు చేశారు.