calender_icon.png 15 November, 2025 | 3:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా పేరుతోనే సైబర్ నేరగాళ్లు డబ్బులు కొట్టేశారు

15-11-2025 12:49:02 PM

  1. నా పేరుతో నకిలీ ఫేస్ బుక్
  2. ఆపదలో ఉన్నానని.. డబ్బు పంపాలని మెసేజ్ లు

హైదరాబాద్: నా పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతాలు(Fake Facebook accounts) సృష్టించి, నా స్నేహితులకు 'నేను ఆపదలో ఉన్నాను. డబ్బులు పంపించండి' అని సైబర్ నేరగాళ్లు సందేశాలు పంపిస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(Sajjanar) పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు, నిజమే అనుకుని నా స్నేహితుడు ఒకరు రూ. 20,000 పంపి మోసపోయారని వివరించారు. నా వ్య‌క్తిగ‌త ఫేస్ బుక్ పేజీ లింక్ ఇది. https://facebook.com/share/1DHPndApWj/.

ఇది మిన‌హా నా పేరుతో ఉన్న మిగ‌తా ఖాతాల‌న్నీన‌కిలివేనని ఆయన వెల్లడించారు. ఈ ఫేక్ ఖాతాల‌ను మెటా స‌హ‌కారంతో హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైం టీం(Hyderabad Cyber ​​Crime Team) తొల‌గించే ప‌నిలో ఉందన్నారు. నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ‌ వ్యక్తి పేరుతో ఫేస్ బుక్‌లో వ‌చ్చే రిక్వెస్ట్‌ల‌పై స్పందించ‌వద్దని సజ్జనార్ తెలిపారు. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండన్నారు. ఒక‌వేళ అలా ఎవ‌రైనా మెసేజ్‌లు చేస్తే.. ముందుగా ఫోన్ ద్వారా వ్యక్తిని స్వయంగా సంప్రదించి పరిశీలించాలని కోరారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, వీడియో కాల్‌ ల‌ను వెంటనే బ్లాక్  చేసి పోలీసులకు రిపోర్ట్ చేయాలని సూచించారు. సైబర్ మోసాలను వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు లేదా http://cybercrime.gov.in లో రిపోర్ట్ చేయాలని కోరారు. మనమంతా జాగ్రత్తగా ఉంటేనే… సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా మనల్ని, మన డబ్బును కాపాడుకోగలమని సీపీ సజ్జనార్ వెల్లడంచారు.