30-10-2025 12:00:00 AM
కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 29 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్రాన్ని రానున్న రోజులలో అభివృద్ది, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిపేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్ - 2047‘ అంశాలతో డాక్యుమెంటును రూపొందిస్తున్నదని, ఈ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. సర్వేలో పాల్గొనడానికి గడువును నవంబర్ 1, 2025 వరకు పొడిగించారని తెలిపారు.
ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, భవిష్యత్ తెలంగాణ నిర్మాణంలో మీ ఆలోచనలు పంచుకోవాలని సూచించారు. అక్టోబర్ 10 వ తేదీన ప్రారంభమైన ఈ సర్వేలో ఇప్పటికే ఉద్యోగులు, ప్రజలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని తెలిపారు.
తెలంగాణ రైజింగ్ విజన్ - 2047 డాక్యుమెంటరీని రూపొందించడంలో ప్రతి రాష్ట్ర పౌరుడు భాగస్వామ్యమై సిటిజన్ సర్వేలో పాల్గొని తెలంగాణాకు దిశను నిర్ణయించాలని అన్నారు. ఈ సర్వేలో పాల్గొనేందుకు http//www.telangana.gov.in/telanganarising/ అనే లింక్ ద్వారా భాగస్వాములు కావాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు.