calender_icon.png 21 January, 2026 | 2:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదరహిత రాష్ట్రంగా తెలంగాణ ముందుండాలి

21-01-2026 12:28:09 AM

సిద్దిపేట క్రైం, జనవరి 20 : ప్రమాదరహిత రాష్ట్రంగా తెలంగాణను దేశంలో ప్రథమ స్థానం లో ఉంచాలని సిద్దిపేట ట్రాఫిక్ ఎస్‌ఐ గోపాల్ రెడ్డి అన్నారు. ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాలు అతిగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల జరిగాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం అర్రైవ్- అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా సిద్దిపేట పట్టణంలోని విపంచి చౌరస్తా వద్ద సిద్దిపేట ట్రాఫిక్ పోలీసులు వాహనదారులతో కలిసి ఫ్ల కార్డులు ప్రదర్శిస్తూ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉద్దేశించి ఎస్‌ఐ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, మద్యం తాగి వాహనం న డపకూడదన్నారు. మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే రూ.10 వేలు జరిమానా, రెం డవసారి పట్టుబడితే జైలు శిక్ష విధించబడుతుందని చెప్పారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పా టించాలని సూచించారు. అనంతరం వాహనదారులతో కలిసి రోడ్డు భద్రత ప్రతిజ్ఞ చేయించారు.