21-01-2026 12:26:57 AM
కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, జనవరి 20 (విజయక్రాంతి): రాబోయే వేసవిలో జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు జిల్లావ్యాప్తంగా పంప్ సెట్లు, పనిచేస్తున్న బోర్వెల్ల పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు. మైనర్ రిపేర్ల కోసం చెక్లిస్ట్ తయారు చేసి గుర్తించిన సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలని ఆదేశించారు.
సంబంధిత శాఖలు సంయుక్తంగా జాయింట్ ఇన్స్పెక్షన్లు నిర్వహించి సమస్యలు ఉత్పన్నం కాకముందే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్లాస్టిక్ వినియోగం లేకుండా చూడాలని, కార్యాలయాల ఫైల్స్ అన్ని ఈ ఆఫీసులో ఉండాలని, ప్రభుత్వ కార్యాలయాల్లో విద్యుత్ వినియోగం తగ్గించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ భుజంగ రావు, మెదక్ ఆర్డిఓ రమాదేవి, జిల్లా అధికారులు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు, మిషన్ భగీరథ అధికారులు, మండల పరిషత్ అధికారులు, హౌసింగ్ ఏఈలు తదితరులు పాల్గొన్నారు.