calender_icon.png 21 January, 2026 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శాంతిమార్గానికి ప్రతీక.. వాసవీ మాత

21-01-2026 12:29:23 AM

నంగునూరు, జనవరి 20: మాఘ శుద్ధ విదియను పురస్కరించుకొని నంగునూరు వైశ్య సం ఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవాన్ని మంగళవారం వైశ్యా భవనంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.అధ్యక్షులు మల్యాల భాస్కర్,ఉపాధ్యక్షులు ఇరుకుళ్ళ రాజు మాట్లాడుతూ.. విష్ణువర్ధన రాజు బలవంతంగా పెళ్లి చేసుకోవాలని ప్రయత్నించిన త రుణంలో, యుద్ధం వల్ల రక్తపాతం జరగకూడదని అమ్మవారు భావించారని గుర్తుచేశారు.

శాంతి మార్గంలోనే ఏదైనా సాధించవచ్చని చాటిచెబుతూ,102 గోత్రాల పెద్దలతో కలిసి అమ్మవారు అగ్ని ప్రవేశం చేశారని కొనియాడారు.అహింసా మార్గంలో మహాత్మా గాంధీ దేశానికి స్వాతం త్య్రం తెచ్చినట్లే, అమ్మవారి శాంతి మంత్రం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య సంఘం సబ్యులు, భక్తులు పాల్గొన్నారు.