18 April, 2026 | 3:26 AM

మళ్లీ తెలంగాణకు ఆమ్రపాలి

25-06-2025 12:00 AM
  1. గతంలో ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించిన కేంద్రం
  2. తాజాగా తిరిగి మన రాష్ట్రానికే కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు

హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): ఐఏఎస్ అధికారి ఆమ్రపాలిని తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులిచ్చింది. ఏడాది క్రితం తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏపీలో రిపోర్ట్ చే యాలని కేంద్రం నిర్ణయించగా...

ఆమ్రపాలి, రొనాల్డ్‌రోస్, వాకాటి కరుణ, వాణిప్రసాద్, ప్రశాంతి ఏపీలో విధుల్లో చేరా రు. తనను తెలంగాణకే కేటాయించాలంటూ ఆమ్రపాలి క్యాట్‌లో పిటిషన్ వేశారు. తాజా గా ఆమెకు అనుకూలంగా క్యాట్ ఉత్తర్వులిచ్చింది. దీంతో ఆమ్రపాలి తిరిగి తెలంగాణ కు రానున్నారు. కాగా ఆమె ఇక్కడ జీహెచ్‌ఎంసీ కమి షనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయంలో ఏపీకి వెళ్లారు.